అమరావతిలో శ్రీనివాస కళ్యాణం.. టీటీడీ ఈవో కీలక సూచనలు

by Jakkula.Mamatha |

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర రాజధాని అమరావతి(Amarawati)లో మార్చి 14వ తేదీన శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని టీటీడీ ఈవో(TTD EO) శ్యామల రావు(Shyamala Rao) తెలిపారు.

అమరావతిలో శ్రీనివాస కళ్యాణం.. టీటీడీ ఈవో కీలక సూచనలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర రాజధాని అమరావతి(Amarawati)లో మార్చి 14వ తేదీన శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని టీటీడీ ఈవో(TTD EO) శ్యామల రావు(Shyamala Rao) తెలిపారు. నేడు(శుక్రవారం) శ్రీనివాస కళ్యాణం పోస్టర్‌ను టీటీడీ ఈవో శ్యామలరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ.. రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో శ్రీవారి ఆలయం కోసం 25 ఎకరాలు ఇచ్చారు. 2018లో ఆలయ నిర్మాణం ప్రారంభించి 2022 జూన్ లో పూర్తి చేశామని తెలిపారు. శ్రీవారి వైభవం తెలియజేసేందుకు ఈ నెల 14న వెంకటపాలెంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నాం. దాదాపు 25 వేల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు(CM Chandrababu) ముఖ్య అతిథిగా వస్తున్నారు.

శ్రీనివాస కళ్యాణం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అని ఈవో శ్యామలరావు వెల్లడించారు. ఈ క్రమంలో అవసరమైన భద్రత, భక్తులకు క్యూలైన్లు, కల్యాణం రోజున భక్తులు వీక్షించేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అమరావతి పరిసర ప్రాంతాలలో విస్తృతంగా ప్రచారం చేసేందుకు వీలుగా సంబంధిత జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కళా బృందాలు, ఆకట్టుకునేలా విద్యుత్, పుష్పాలంకరణ, అన్నప్రసాదాలు పంపిణీ ఏర్పాట్లు చేయాలని కోరారు.

Next Story