చిన్న చిన్న విషయాలపై స్పందించే పవన్ ఇప్పుడెందుకు స్పందించలేదు..రాయుడు సోదరి ఆవేదన

by Ajay Maddhiboyina |

శ్రీ కాళహస్తి జనసేన పార్టీ ఇంచార్జ్ వినూత దంపతులు తమ వద్ద డ్రైవర్‌గా పనిచేసే శ్రీనివాస్ రాయుడును హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే డ్రైవర్ శ్రీనివాస్ జనసేనలో కీలక కార్యకర్త మాత్రమే కాకుండా పవన్ కల్యాణ్ వీరాభిమాని అని తెలుస్తోంది.

చిన్న చిన్న విషయాలపై స్పందించే పవన్ ఇప్పుడెందుకు స్పందించలేదు..రాయుడు సోదరి ఆవేదన
X

దిశ‌, వెబ్ డెస్క్: శ్రీ కాళహస్తి జనసేన పార్టీ ఇంచార్జ్ వినూత దంపతులు తమ వద్ద డ్రైవర్‌గా పనిచేసే శ్రీనివాస్ రాయుడును హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే డ్రైవర్ శ్రీనివాస్ జనసేనలో కీలక కార్యకర్త మాత్రమే కాకుండా పవన్ కల్యాణ్ వీరాభిమాని అని తెలుస్తోంది. ఇప్పటికే జనసేన పార్టీ నుండి వినూత దంపతులను సస్పెండ్ చేయగా పవన్ మాత్రం శ్రీనివాస్ హత్యపై స్పందించలేదు. దీంతో శ్రీనివాస్ సోదరి కీర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు శ్రీకాళహస్తి డీఎస్పీ ఆఫీసుకు వెళ్లిన కీర్తి తమకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శ్రీనివాస్ ను హత్య చేసిన వినూత దంపతులు తమకు రూ.30 లక్షలు ఆఫర్ చేశారని తాము ఒప్పుకోలేదని చెప్పారు. పవన్ కల్యాణ్ చిన్నచిన్న విషయాలపై స్పందిస్తాడని ఈ విషయంపై ఎందుకు స్పందిచడం లేదని అన్నారు. వీలైనంత త్వరగా పవన్ తమ సోదరుడికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. సోషల్ మీడియాలో తాము ఒకటి మాట్లాడితే మరొకటి ప్రసారం చేస్తున్నారని అన్నారు. అక్రమ సంబంధాలు ఉన్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పై తమకు ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు.

Next Story