ఆత్మకూరు వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతంరెడ్డి భార్య శ్రీకీర్తి?

by Sathputhe Rajesh |   (  Updated:2022-03-31 04:25:30  IST  )

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అకాల మరణంతో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన ఆత్మకూరు నియోజకవర్గానికి ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ

ఆత్మకూరు వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతంరెడ్డి భార్య శ్రీకీర్తి?
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అకాల మరణంతో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన ఆత్మకూరు నియోజకవర్గానికి ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గౌతంరెడ్డి భార్య శ్రీకీర్తి పోటీ చేసే అవకాశముంది. ఈ మేరకు వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గౌతంరెడ్డి కుటుంబసభ్యులు, బంధువులు పోటీ చేస్తే ప్రతిపక్ష టీడీపీ పోటీ నుంచి తప్పుకోనుంది. అయితే శ్రీకీర్తి పోటీ చేసే విషయంమై మేకపాటి కుటుంబం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఉపఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై ఈసీ ఇప్పటివరకు ఇంకా క్లారిటీ లేదు. దీంతో నోటిఫికేషన్ వెలువడే సమయానికి మేకపాటి కుటుంబం నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Next Story