- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాకు పవన్ కల్యాణ్ న్యాయం చేయాలి.. డ్రైవర్ శ్రీనివాస్ చెల్లెలు
జనసేన శ్రీకాళహస్తి ఇన్‌చార్జ్ కోట వినూత ఆమె భర్త చంద్రబాబు వారి వద్ద పనిచేసే డ్రైవర్ శ్రీనివాస్‌ను హత్య చేసి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: జనసేన శ్రీకాళహస్తి ఇన్‌చార్జ్ కోట వినూత ఆమె భర్త చంద్రబాబు వారి వద్ద పనిచేసే డ్రైవర్ శ్రీనివాస్‌ను హత్య చేసి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. శ్రీనివాస్‌ను తమ గోడౌన్‌లో హత్య చేసి డెడ్ బాడీని చెన్నై సమీపంలోని ఓ కాలువలో పడేశారు. డెడ్ బాడీని తీసుకెళ్లిన కారు కోట దంపతులదే కావడంతో పోలీసులు విచారణ జరిపి నింధితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా నేడు శ్రీనివాస్ మృతదేహాన్ని శ్రీకాళహస్తిలోని వారి నివాసానికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో అన్న మృతదేహాన్ని చూసి అతడి సోదరి బోరున విలపించింది.
తన సోదరుడిని చంపేసింది కోట వినూత ఆమె భర్త చంద్రబాబులే అని మండిపడింది. తమ కుటుంబం మొత్తాన్ని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడినట్టు తెలిపింది. తమ అన్నయ్యను కొట్టి వాళ్ల దగ్గరే పెట్టుకుని చంపేశారని ఆవేదన వ్యక్తం చేసింది. పవన్ కల్యాణ్ న్యాయం చేయాలని, జనసేన వల్ల తమకు న్యాయం జరగకపోతే మరో పార్టీకి వెళ్లి పోరాడతామని స్పష్టం చేసింది. వాళ్లను పోలీస్ స్టేషన్ లో వేసి తరవాత వదిలిపెడితే ఊరుకునేది లేదని హెచ్చరించింది.






