- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘చనిపోయాక పింఛన్ మంజూరు చేస్తారా..?’ గ్రీవెన్స్ సెల్‌లో వృద్ధురాలి ఆవేదన వైరల్
‘నేను చనిపోయాక పింఛన్ మంజూరు చేస్తారా..?’ అంటూ ఓ వృద్ధురాలు ప్రభుత్వ అధికారుల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ‘నేను చనిపోయాక పింఛన్ మంజూరు చేస్తారా..?’ అంటూ ఓ వృద్ధురాలు ప్రభుత్వ అధికారుల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్ (ప్రజా ఫిర్యాదుల విభాగం) లో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు ఆసరా పింఛన్ కోసం గత రెండు సంవత్సరాలుగా దరఖాస్తు చేసుకుని నిరీక్షిస్తోంది. ఎన్నిసార్లు అధికారుల వద్దకు వెళ్లి ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో విసుగుచెందిన బాధితురాలు జిల్లా గ్రీవెన్స్ సెల్ వద్ద తన గోడును వెళ్లబోసుకుంది.
‘న్యాయం అనేది ఉందా..?’
అధికారుల నిర్లక్ష్యంపై వృద్ధురాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘గడిచిన రెండేళ్లుగా పింఛన్ కోసం పిచ్చిపట్టినట్టుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అసలు న్యాయం అనేది ఉందా? ఏడిస్తే ఏడిచారు అంటారు.. గట్టిగా మాట్లాడితే మాట్లాడిన అంటారు.. నాకు చావే పరిష్కారమా? దయచేసి నాకు న్యాయం చేయండి’ అని గ్రీవెన్స్ సెల్ అధికారితో తన ఆవేదనను తెలిపారు. వృద్ధురాలు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్న దృశ్యాలను అక్కడున్న వారు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వృద్ధురాలిని చూసిన నెటిజన్లు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఆ వృద్ధురాలికి వెంటనే పింఛన్ మంజూరు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.






