Srikakulam: వైసీపీ కార్యకర్త దారుణహత్య.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేటలో దారుణం జరిగింది....

Srikakulam: వైసీపీ కార్యకర్త దారుణహత్య.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేట(Faridpet)లో దారుణం జరిగింది. నడి రోడ్డుపై వైసీపీ కార్యకర్త గోపి హత్యకు గురయ్యారు. రోడ్డుపై కాపు కాసి మరీ గోపిని ప్రత్యర్థులు నరికి చంపారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన ఘటనలను మనసులో పెట్టుకుని ప్రతీకారంగా గోపిని చంపినట్లు తెలుస్తోంది. అయితే విషయం తెలుసుకున్న స్థానిక ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీంతో ఆయన్ను స్థానికులు అడ్డుకున్నారు. గోపి హత్యకు పోలీసుల వైఫల్యమే కారణమంటూ నినాదాలు చేశారు. నిందితులను వెంటనే పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు.

Next Story