నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, ట్యాంకర్, కారు ఢీ..

by Vemula.Srinu Prasad |

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు జాతీయ రహదారి)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాలూరు నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును జియో ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. ..

నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, ట్యాంకర్, కారు ఢీ..
X

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లా(Parvathipuram Manyam District) సాలూరు జాతీయ రహదారి(Salur National Highway)పై ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. సాలూరు నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును జియో ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. ఇదే సమయంలో వర్షం కురుస్తుండటంతో అదుపుతప్పిన ఒక కారు వెనుక నుంచి వచ్చి బస్సును ఢీకొట్టింది. స్థానిక డీజే డాబా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

బస్సు ప్రయాణికురాలికి తీవ్ర గాయాలు

ఈ ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం తక్షణమే సాలూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. భారీ వర్షం కారణంగా రహదారిపై వాహనాలు అదుపు తప్పడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story