- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీకాకుళంలో థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ ర్యాలీ
థర్మల్ పవర్ ప్లాంట్ (Thermal Power Plant) ఏర్పాటును వ్యతిరేకిస్తూ శ్రీకాకుళంలో (Srikakulam) థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ ర్యాలీని నిర్వహించింది.

దిశ, వెబ్ డెస్క్ : థర్మల్ పవర్ ప్లాంట్ (Thermal Power Plant) ఏర్పాటును వ్యతిరేకిస్తూ శ్రీకాకుళంలో (Srikakulam) థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ ర్యాలీని నిర్వహించింది. థర్మల్ ప్లాంట్ ప్రతిపాదనలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టి చలో సరుబుజ్జిలో కార్యక్రమంలో భాగంగా ర్యాలీని నిర్వహించింది. ఈ క్రమంలో గిరిజనులతో కలిసి వెన్నలవలస నుంచి సరుబుజ్జిలి వరకు ర్యాలీగా బయలేదేరింది. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకోగా.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బాణాలు, సంప్రదాయ వస్త్రధారణలో గిరిజనులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. తమ గ్రామంలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మానవాళి మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతున్న ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదినలను విరమించుకోవాలని అంటున్నారు. లేదంటే పోరాటాలు తప్పవని.. గిరిజనుల హక్కుల కాపాడడానికి ఎంత వరకైనా వెళ్తామని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ ఈ సందర్భంగా స్పస్టం చేశారు.






