- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap News: చంద్రబాబు కొడుకైతే లోకేశ్ సీఎం అయిపోతారా?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై రాష్ట్రమంత్రి సీదిరి అప్పలరాజు మరోసారి రెచ్చిపోయారు....

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై రాష్ట్రమంత్రి సీదిరి అప్పలరాజు మరోసారి రెచ్చిపోయారు. చంద్రబాబు కొడుకు లోకేశ్ పనికి మాలినవాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువగళం పాదయాత్రలో లోకేశ్ ఏం మాట్లాడతాడో తెలియదని, ఎందుకు మాట్లాడుతాడో తెలియదంటూ సెటైర్లు వేశారు. శ్రీకాకుళంలో శనివారం సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. లోకేశ్‌కు ఎంత సేపు ముఖ్యమంత్రి పీఠంపైనే కన్ను అని విమర్శించారు. చంద్రబాబు కొడుకైతే ముఖ్యమంత్రి అయిపోతారా? అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పదవి వీళ్ల బాబు జాగీరా అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు.
కాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఆయన చేపట్టిన పాదయాత్ర 700 కిలో మీటర్లు దాటింది. ప్రభుత్వ వైఫల్యాలపై పాదయాత్రలో నారా లోకేశ్ విమర్శలు చేస్తున్నారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర సాగిస్తున్నారు. దీంతో నారా లోకేశ్‌పై అటు వైసీపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా లోకేశ్‌పై మంత్రి అప్పలరాజు కూడా తీవ్ర విమర్శలు చేశారు.






