Minister Dharmana: మొదట తీసేది మిమ్మల్నే.. వలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-02-06 12:11:17  IST  )

టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు మొదట తుపాకీ పేల్చేది వలంటీర్లపైనేనని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు....

Minister Dharmana: మొదట తీసేది మిమ్మల్నే.. వలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు మొదట తుపాకీ పేల్చేది వలంటీర్లపైనేనని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. కాబట్టి చంద్రబాబు కంటే ముందే మనమే పేల్చాలని, మన దగ్గర తుపాకీ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా సత్యవాడలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేవఆరు. నిత్యావసర వస్తువుల ధరలు ఏపీలో పెరుగుతున్నాయా? అని ప్రశ్నించారు. దేశమంతా పెరుగుతుంటే ఏం చేయగలమన్నారు. రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో వలంటీర్లు ప్రజలకు వివరించాలని తెలియజేశారు. ప్రజలకు అవగాహన కల్పించాలని.. వారిని సరైన దారిలో తీసుకెళ్లాలని సూచించారు. ఏ రాజకీయ పార్టీకి ఓటెయ్యాలో, ఏ పార్టీ మంచిదో కూడా వలంటీర్లు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి పౌరుడికి హక్కు ఉన్నట్టే వలంటీర్‌కు కూడా చెప్పే హక్కు ఉందని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి తుపాకీ పేల్చేది వలంటీర్లపైనేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతకంటే ముందే మనమే పేల్చాలి. మన దగ్గరా తుపాకీ ఉంది అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు

Next Story