ఎచ్చెర్ల బీజేపీలో కలకలం.. అభ్యర్థిపై అసమ్మతి వర్గం ఆగ్రహం

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-03-29 14:40:17  IST  )

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల బీజేపీలో కలకలం రేగింది. బీజేపీ అభ్యర్థిగా ఈశ్వర్ రావును ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించింది...

ఎచ్చెర్ల బీజేపీలో కలకలం.. అభ్యర్థిపై అసమ్మతి వర్గం ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల బీజేపీలో కలకలం రేగింది. బీజేపీ అభ్యర్థిగా ఈశ్వర్ రావును ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా అసమ్మతి బయటపడింది. ఈశ్వర్ రావు అభ్యర్థిత్వాన్ని అసమ్మతి వర్గం వ్యతిరేకిస్తోంది. అభ్యర్థిని మార్చాల్సిందేనని పట్టుబడుతోంది. లేదంటే సహకరించేది లేదని తెగేసి చెప్పింది. వచ్చే ఎన్నికల్లో ఈశ్వర్ రావు ఓటమి ఖాయమంటూ హెచ్చరించారు. ఈశ్వర్ రావు కాకుండా ఎవరికి సీటు ఇచ్చినా తాము సహకరిస్తామని, లేదంటే బీజేపీకి ఓటు వేయమని చెబుతున్నారు. ఈశ్వర్ రావు అభ్యర్థిత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే మూకుమ్మడి రాజీనామాలకు సైతం సిద్ధమని హెచ్చరించారు.

Read More..

విద్యారంగంలో మార్పులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Next Story