- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాశీబుగ్గ తొక్కిసలాటపై విచారణకు హోంమంత్రి ఆదేశం
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చోటు చేసుకున్న దుర్ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Minister Vangalapudi Anitha) విచారణకు ఆదేశించారు.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చోటు చేసుకున్న దుర్ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Minister Vangalapudi Anitha) విచారణకు ఆదేశించారు. ఈ విషయమై శ్రీకాకుళం జిల్లా ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు.
కార్తీక మాసం, ఏకాదశి, శనివారం కావడంతో శ్రీకాకుళం (Srikakulam) కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో సుమారు 9 మంది ప్రాణాలను కోల్పోయారు. గాయపడిన వారిన స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read More..
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు






