- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bribe: ఏసీబీకి చిక్కిన శ్రీకాకుళం డీఎంహెచ్‌వో
అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కారు

దిశ, వెబ్ డెస్క్: అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లంచం డబ్బులకోసం కక్కుర్తిపడ్డారు. బల్లకింద చేయి పెట్టి అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన శ్రీకాకుళంలో జరిగింది. పేదలకు వైద్యం అందించి ప్రాణాలు కాపాడాల్సిన డీఎంహెచ్‌వో లంచాల సొమ్ముకు అలవాటు పడ్డారు. ఎప్పుడూ మాదిరి అవినీతి తంతు సాజావుగానే జరిగిపోతుందిలే అని అనుకున్నారు. కానీ ఏసీబీ అభికారులు వదిలిపెట్టలేదు. పథకం ప్రకారం అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం డీఎంహెచ్‌వో బాలమురళికృష్ణను స్థానిక ఉద్యోగి కలిశారు. తనకు రీపోస్టింగ్ ఇవ్వాలని కోరారు.
అయితే ఇందుకు రూ.20 వేలు ఇవ్వాలని బాలమురళికృష్ణ డిమాండ్ చేశారు. లంచం ఇచ్చుకోలేని సదరు ఉద్యోగి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో లంచం తీసుకుంటుండగా బాలమురళికృష్ణను రెడ్ హ్యాండెండ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. శాఖా పర్యమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.






