శ్రీకాకుళంలో డయేరియా కేసులు.. తాగునీటిలో ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా గుర్తింపు : కమిషనర్‌

by Ramesh Naini |

జిల్లాలో విస్తరిస్తున్న అతిసార వ్యాధికి (డయేరియా) కలుషిత తాగునీరే ప్రధాన కారణమని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ స్పష్టం చేశారు.

శ్రీకాకుళంలో డయేరియా కేసులు.. తాగునీటిలో ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా గుర్తింపు : కమిషనర్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: జిల్లాలో విస్తరిస్తున్న అతిసార వ్యాధికి (డయేరియా) కలుషిత తాగునీరే ప్రధాన కారణమని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ స్పష్టం చేశారు. నీటి నమూనాల పరీక్షల్లో ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ (E. coli) బ్యాక్టీరియా ఉన్నట్లు తేలిందని ఆయన వెల్లడించారు.

నీటి నమూనాల్లో బయటపడ్డ వాస్తవాలు

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లతో కలిసి కమిషనర్ నగరంలోని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుండి సేకరించిన 11 నీటి నమూనాల్లో ఈ బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించాయని, ఇదే అతిసార ప్రబలడానికి ముఖ్య కారణమని వివరించారు.

నలుగురు మృతి చెందినట్లు వార్తలు!

కాగా, జిల్లాలో డయేరియా విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 68 మంది తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అతిసార బారినపడి ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా రెల్లి వీధిలోని బీసీ హాస్టల్‌లో ముగ్గురు విద్యార్థులు వాంతులు, విరోచనాలతో ఆస్పత్రిలో చేరారు.

Next Story