జర్జంగిలో రోడ్డుప్రమాదం.. ఒకరు మృతి, 12 మందికి తీవ్రగాయాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-08 12:43:29  IST  )

కాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎచ్చెర్ల మండలం జర్జంగిలో ఆటోను కారు ఢీకొట్టింది

జర్జంగిలో రోడ్డుప్రమాదం.. ఒకరు మృతి, 12 మందికి తీవ్రగాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా(Srikakulam District)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఎచ్చెర్ల మండలం జర్జంగి(Jarjangi)లో ఆటో(Auto)ను కారు(Car) ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో12 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో ఆటోనుజ్జునుజ్జయింది. యాక్సిడెంట్ సీసీ దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గురైన కారు, ఆటోను పక్కకు తీశారు. ఘటన కారణంగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారు అతివేగమే కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. స్థానిక సీసీ కెమెరాలు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Next Story