క‌వ్వింపు చర్యలకు దిగొద్దు..! శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు హ‌ల్‌చల్

by Ramesh Naini |   (  Updated:2025-12-16 07:29:40  IST  )

శ్రీకాకుళం జిల్లాలో మరోసారి ఏనుగుల గుంపు హల్‌చల్‌తో ఉలిక్కిపడింది.

క‌వ్వింపు చర్యలకు దిగొద్దు..! శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు హ‌ల్‌చల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీకాకుళం జిల్లాలో మరోసారి ఏనుగుల గుంపు హల్‌చల్‌తో ఉలిక్కిపడింది. తాజాగా భామిని మండలంలోకి ప్రవేశించిన అడవి ఏనుగుల గుంపు పలు గ్రామాల్లో పంటలను నాశనం చేశాయి. పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల సంచారంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రాత్రి వేళల్లో ఏనుగులు గ్రామాల సమీపంలో తిరుగుతుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావట్లేదు.

ఎనుగుల గుంపునకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఏనుగులు కనిపించిన వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించాలని, భద్రతా చర్యలు పాటించాలని అధికారులు కోరారు. గ్రామ‌స్తులెవ‌రూ కూడా ఎనుగుపై క‌వ్వింపు చ‌ర్యల‌కు పాల్పడొద్దని అధికారులు సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. వీడియో ఇదే..

Next Story