- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీకాకుళం | వరుస కట్టిన వైసీపీ నేతలు.. టీడీపీలోకి చేరికలు
టీడీపీలోకి వైసీపీ నేతలు వరుస కట్టారు. మంచి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : టీడీపీలోకి వైసీపీ నేతలు వరుస కట్టారు. మంచి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని, కూటమి ప్రభుత్వ పాలనను బలపరుస్తూ ప్రజా సేవలో భాగస్వాములయ్యేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం రాజకీయాల్లో ఓ శుభ పరిణామం చోటు చేసుకుంది. కోటపాడు, వడ్డితాడ్ర పంచాయతీలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలోకి వచ్చారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో పసుపు కండువాలను కప్పుకున్నారు. నిమ్మాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో చేరికల కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వైసీపీ శ్రేణులకు మంత్రి స్వయంగా కండువాలను కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రగతిశీల పాలన, సంక్షేమ కార్యక్రమాలను విశ్వసించి వైసీపీ నేతలు చేరడం హర్షణీయమన్నారు. కోటపాడు పంచాయతీ మాజీ సర్పంచ్ అప్పలరాజు, రెడ్డి అప్పన్న వంటి కీలక వ్యక్తులు పార్టీలో చేరడం కూటమి ప్రభుత్వానికి మరింత బలాన్నిచ్చిందన్నారు. అభివృద్ధిని కాంక్షించే ప్రజలంతా తండ్రి సమానులైన చంద్రబాబు నాయకత్వాన్ని ఆశిస్తున్నారు అనడానికి ఈ చేరికలే నిదర్శనం అని ప్రకటించారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం అన్నారు. అందరూ కష్టపడి పని చేస్తే, ఆయా గ్రామాల అభివృద్ధికి తాను మంత్రిగా తన వంతు పూర్తి సహకారం ఎప్పుడూ అందిస్తానని భరోసానిచ్చారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.






