- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డయేరియా విజృంభణ.. మున్సిపల్ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు
శ్రీకాకుళంలో డయేరియా విజృంభణకు మున్సిపల్ కమిషనరే కారణమని పేర్కొంటూ అధికారులు నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం డయేరియా కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తమైంది. ఒకేసారి 76 మంది ఆస్పత్రి పాలవ్వడం, వారిలో ఎనిమిదిమంది వెంటిలేటర్ పై ఉండగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా రియాక్టైంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో డయేరియా ప్రబలడం వెనుక మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా గుర్తించారు. దీంతో శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ గా ఉన్న కూర్మారావుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






