- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Srikakulam : హృదయ విదారకం.. 150 తాబేళ్ల మరణం
ప్లాస్టిక్ వలలు... యాంత్రిక బోట్లతో తాబేళ్లకు ప్రాణాపాయం.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలోని వజ్రపుకొత్తూరు (Vajrapu Kotturu) మండలం డోకులపాడు సముద్రతీరంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. సుమారు 150 తాబేళ్లు సముద్రంలో మరణించి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. అది చూసినవారి గుండె తరుక్కుపోయింది. మనుషులు చేస్తున్న పర్యావరణ విధ్వంసం కళ్లకు కట్టింది. తీరం వెంబడి చలనం లేకుండా పడి ఉన్న ఆ తాబేళ్ల మృతదేహాలు మనుషుల మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా కనిపించాయి. అయితే మృతి చెందిన తాబేళ్లను చూసి చలించిన పోయిన స్నేహ కళామండలి సభ్యులు వాటికి అంత్యక్రియలను నిర్వహించారు. ప్రత్యేకంగా గుంతలను తవ్వి చనిపోయిన తాబేళ్లను పూడ్చిపెట్టారు. విషయం తెలుసుకున్న పర్యావరణ ప్రేమికులు తాబేళ్లకు నివాళులు అర్పించారు. పర్యావరణ పరిరక్షణ చేయకపోతే జీవ వైవిధ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆలివ్ రిడ్లే తాబేళ్ల మరణం ఈ ప్రాంతంలో కొత్తేమి కాదంటున్నారు. ఏండ్లుగా అవి మరణిస్తున్నా కూడా వాటి సంరక్షణను గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
శ్రీకాకుళం తీర ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉండడం ప్రతి ఏడాది ఆలివ్ రిడ్లీ తాబేళ్లు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల నుంచి ప్రయాణించి వస్తుంటాయని పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు. అందులోనూ శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు ఉన్న 978 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతంలో సంతానోత్పత్తి కోసం వస్తుంటాయని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు, పలాస, బారువ, విశాఖపట్నం జిల్లాలోని ఆర్.కె.బీచ్, భీమిలి, సాగర్ నగర్ ప్రాంతాల్లో నవంబర్ నుంచి మే వరకు ఆలివ్ రిడ్లీ తాబేళ్లు గుడ్లు పెడతాయని అంటున్నారు. అయితే ప్లాస్టిక్ వలలు, స్పీడ్ బోట్లు వంటివి ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణానికి ఒక కారణంగా వారు పేర్కొంటున్నారు. సంప్రదాయ వలలో చిక్కుకున్న తాబేళ్లను తిరిగి సముద్రంలోకి వదిలేసేవారని.. ప్లాస్టిక్ వలలో చిక్కుకున్న తాబేళ్లు గాయపడి ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2022 మార్చి నెలలో కూడా వందలాది తాబేళ్లు విగత జీవులుగా మారాయని పర్యావరణ ప్రేమికులు గుర్తు చేస్తున్నారు. వాటి సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.






