Sriharikota: బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం

by Gantepaka Srikanth |

శ్రీహరికోట(Sriharikota)లో బాహుబలి రాకెట్(Bahubali Rocket) ప్రయోగం విజయవంతమైంది. ఈ విషయాన్ని ఇస్రో(ISRO) చీఫ్ అధికారంగా ప్రకటించారు.

Sriharikota: బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీహరికోట(Sriharikota)లో బాహుబలి రాకెట్(Bahubali Rocket) ప్రయోగం విజయవంతమైంది. ఈ విషయాన్ని ఇస్రో(ISRO) చీఫ్ అధికారంగా ప్రకటించారు. ఈ ఉపగ్రహం బరువు 4,410 కిలోలు. భారత భూభాగం నుంచి కక్ష్యలోకి ప్రయోగించిన శాటిలైట్లన్నింటిలోకీ ఇదే అత్యంత బరువైనది. సీఎంఎస్‌-03 ఉపగ్రహం ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడటంతో పాటు సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకునే వెసులుబాటు కలగనుంది. ప్రధానంగా భారత నౌకాదళం కోసం దీన్ని రూపొందించారు. సాగర జలాల్లో మోహరించిన మన యుద్ధనౌకలు, జలాంతర్గాములు, భూ నియంత్రణ కేంద్రాలతో భద్రమైన కమ్యూనికేషన్లు సాగించేందుకు ఈ శాటిలైట్‌ తోడ్పాటు అందిస్తుంది. దీన్ని జీశాట్‌-7ఆర్‌ అని కూడా పిలుస్తారు. 2013 నుంచి సేవలు అందిస్తున్న జీశాట్‌-7 స్థానంలో దీన్ని ప్రయోగించారు. ఈ ప్రయోగంతో ఇస్రో మరో మైలు రాయిని చేరుకుంది. దాదాపు పది సంవత్సరాల పాటు కక్ష్యలో పరిభ్రమిస్తూ ఈ ఉపగ్రహం సేవలు అందించనుంది.

Next Story