- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైయస్ఆర్ సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్ సీపీ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్ సీపీ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చింది. పార్టీ అధినేత వైయస్ జగన్ పిలుపు మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం పోస్టరును ఆవిష్కరించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన పోస్టరు ఆవిష్కరణ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గ కేంద్రంలో అక్టోబరు 28న నిర్వహించే ర్యాలీ నేపథ్యంలో పోస్టరును ఆవిష్కరించినట్లు నాయకులు తెలిపారు.
ఆనం విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ నాయకత్వం పిలుపు మేరకు వచ్చే మంగళవారం నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని దర్గామిట్ట దగ్గరున్న బారా షాహీద్ దర్గా నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. తద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పట్ల తమ వ్యతిరేకతను వ్యక్తపరుస్తామన్నారు. ర్యాలీ అనంతరం అధికారులకు వినతి పత్రం ఇస్తామని తెలిపారు.
పోస్టరు ఆవిష్కరణ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, నెల్లూరు జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






