Vanteru Venugopal Reddy: సీఎం జగన్ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధం

by Vemula.Srinu Prasad |

వైసీపీ అధిష్టానం ఆదేశిస్తే కావలి ఉదయగిరి నియోజకవర్గాలలో ఎక్కడైనా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు..

Vanteru Venugopal Reddy: సీఎం జగన్ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధం
X

దిశ, కావలి: వైసీపీ అధిష్టానం ఆదేశిస్తే కావలి ఉదయగిరి నియోజకవర్గాలలో ఎక్కడైనా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కావలి ఉదయగిరి నియోజకవర్గాల పట్టభద్రులు తూర్పు రాయలసీమ ప్రకాశం నెల్లూరు చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నిటి శ్యాం ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయ అభ్యర్థి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ఉదయగిరి, కావలి నియోజకవర్గాల పట్టభద్రులు మొదటి ప్రాధాన్యతగా గెలిపించాలని పిలుపునిచ్చారు. కావలి, ఉదయగిరి నియోజకవర్గాలు రెండు కళ్ళు అని, ఉదయగిరి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నది వాస్తవమేనని స్పష్టం చేశారు. టికెట్ విషయంపై వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళనున్నామని వంటేరు వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story