జిల్లాలో జంటహత్యల కలకలం.. పక్కా ప్లాన్‌తో అటాక్ ?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-30 06:00:03  IST  )

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇద్దరు యువకులు గత రాత్రి హత్యకు గురికావడం తీవ్ర కలకలానికి దారితీసింది.

జిల్లాలో జంటహత్యల కలకలం.. పక్కా ప్లాన్‌తో అటాక్ ?
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇద్దరు యువకుల హత్యలు కలకలం రేపాయి. కొడవలూరు మండలం గండవరం వద్ద ఈ దారుణ ఘటన జరిగింది. వడ్డిపాలెం మెయిన్ రోడ్డులో ఇద్దరు యువకులను గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతిచెందిన యువకులను పెద్దపుత్తెడు గ్రామానికి చెందిన కుందుర్తి వెంకటేష్ (29), వెంగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన బాలవెంకయ్య (27)గా గుర్తించారు. గత రాత్రి వరికోత మిషన్ లో డీజిల్ పోసేందుకు వెళ్తుండగా.. దుండగులు దారికాచి చంపినట్లుగా భావిస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలోనే తమ కుమారులను చంపేశారంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పక్కా ప్లాన్ తోనే వెంకటేష్, వెంకయ్యలపై అటాక్ చేసి చంపినట్లుగా అనుమానిస్తున్నారు. గ్రామంలో గతంలో వివాహేతర సంబంధాల గొడవలు జరగ్గా.. ఆ గొడవల కారణంగానే వీరిని చంపినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Next Story