రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 65 మంది ప్రయాణికులకు..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-30 12:19:47  IST  )

నెల్లూరు జిల్లాలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి...

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..  65 మంది ప్రయాణికులకు..!
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా(Nellore District)లో ఘోర ప్రమాదం తప్పింది. రెండు ఆర్టీసీ బస్సులు(Rtc Buses) ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సమయంలో రెండు బస్సుల్లో మొత్తం 65 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటిగాయాలు కాలేదు. దీంతో ప్రయాణికులంతా ఊపరిపీల్చుకున్నారు. ఈ ఘటన రావూరు- చిట్వేలు ఘాట్ రోడ్డు జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు బస్సులను రోడ్డు నుంచి పక్కకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story