- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > ఏపీ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య.. స్కూలు వద్ద ఉద్రిక్తత
టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య.. స్కూలు వద్ద ఉద్రిక్తత
by Vemula.Srinu Prasad |
నెల్లూరులో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యతో స్కూలు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా ఫతేఖాన్‌పేట(Fatehkhanpet)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రైవేటు స్కూల్లో(Private School) చదువుతున్న పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య(suicide) చేసుకున్నారు. ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఇందుకు తోటి విద్యార్థి కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. అనంతరం విద్యార్థి సంఘాలతో కలిసి స్కూలు వద్ద ఆందోళనకు దిగారు. స్కూలు కరస్పాండెంట్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళనను విరమించారు.
Next Story






