Kavali: పెట్రోల్ పోసుకుని దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం (Video)

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-03 08:07:49  IST  )

నెల్లూరు జిల్లా కావలి తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది...

Kavali: పెట్రోల్ పోసుకుని దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం (Video)
X

దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లా కావలి తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. జాతీయ వికలాంగుల సంఘం నాయకులు మండవ వెంకట్రావు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దివ్యాంగుల కాలనీలను సకలాంగులు ఆక్రమించి ఇళ్ళు కడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్‌ను కోరినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆక్రమణ దారులను అడ్డుకుంటే తమపైనే కేసులు బనాయిస్తామని బెదిరింపులకు దిగారని ఆరోపించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు వెల్లడించారు. దివ్యాంగులకు కేటాయించిన స్థలాలు కబ్జాకు గురికాకుండా చూడాలని మండవ వెంకట్రావు కోరారు.

Next Story