- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Naralokesh: ఆనంపై దాడి వైసీపీ మూకల పనే
by Vemula.Srinu Prasad |
నెల్లూరు జిల్లాలో టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై కొందరు దుండగులు దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. ..

X
దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లాలో టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై కొందరు దుండగులు దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. ఈ దాడి వైసీపీ మూకల పనే అని ఆరోపించారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే ప్రభుత్వానికి ఎందుకు ఇంత ఉలికిపాటు అని లోకేశ్ నిలదీశారు. టీడీపీ గొంతుకను బలంగా వినిపిస్తున్న ఆనం వెంకటరమణారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగిన వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలకి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ మేరకు లోకేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Next Story






