సెల్ ఫోన్ దొంగతనం చేసిందనే అనుమానం.. బాలిక బట్టలు విప్పి.. ఐరన్ రాడ్డుతో కాల్చి టార్చర్.. ముఖంపై వాతలతో (వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-22 19:02:41  IST  )

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కాకర్ల దిబ్బలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. షెడ్యూల్డ్ ట్రైబ్ కాలనీ కుడితేపాలెంకు చెందిన పదేళ్ల గిరిజన బాలిక చెంచమ్మను ఘోరంగా హింసించారు. మొబైల్ ఫోన్ దొంగిలించిందన్న అనుమానంతో..

సెల్ ఫోన్ దొంగతనం చేసిందనే అనుమానం.. బాలిక బట్టలు విప్పి.. ఐరన్ రాడ్డుతో కాల్చి టార్చర్.. ముఖంపై వాతలతో (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కాకర్ల దిబ్బలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. షెడ్యూల్డ్ ట్రైబ్ కాలనీ కుడితేపాలెంకు చెందిన పదేళ్ల గిరిజన బాలిక చెంచమ్మను ఘోరంగా హింసించారు. మొబైల్ ఫోన్ దొంగిలించిందన్న అనుమానంతో.. చిన్నారి బట్టలు విప్పి, కాల్చిన ఇనుప రాడ్‌తో శరీరం, ముఖంపై కాల్చారు. తాను దొంగిలించలేదని పదే పదే చెప్పినా.. బలవంతంగా హింసించారని.. తన గాయాలను చూపించి.. ఏడుస్తూ చెప్తోంది బాధితురాలు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా తల్లి మరో వివాహం చేసుకోవడంతో చెంచమ్మ తన అత్త సన్నారి మాణిక్యం దగ్గర నివసిస్తోంది. కానీ ఆమె పాపను ప్రతి విషయంలో టార్చర్ చేస్తున్నట్లు సమాచారం. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక అత్తతో సహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. మనుషులు ఇంత కర్కశంగా ఉంటారా.. మానవుల్లాగా బతకడం మరిచిపోయారా అని కామెంట్ చేస్తున్నారు.

VIDEO

Next Story