పంటలను ముంచేసిన వర్షం.. 400ల ఎకరాల్లో నష్టం

by Thanuru Gopichand |

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

పంటలను ముంచేసిన వర్షం.. 400ల ఎకరాల్లో నష్టం
X

దిశ, వెబ్ డెస్క్ : నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా పంట చేతికొచ్చే సమయంలో వానలు దంచి కొడుతుండడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా (Nellore District) కలువాయి మండలంలోని కుల్లూరు, వెంకటరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 400ల ఎకరాల వరి పంట మునగడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. చేతికొచ్చిన పంట (Crop) తమ కళ్ల ముందే వరద నీటి పాలైందని వాపోతున్నారు. భారీగా కురిసిన వర్షాలకు వరద నీరంతా పంటలపై ప్రవహించడంతో వరి నీటిలో మునిగిపోయిందని చెబుతున్నారు. వరి కంకులు నీటిలో నాని మొలకలు రావడంలో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కోతకు వచ్చిన పంట చేతికి రాకుండా పోయిందని.. తమను ఆదుకునే నాథులెవరని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం (Government) సత్వరమే స్పందించిన తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించిన పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విన్నవిస్తున్నారు.

Next Story