వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు : మంత్రి నారాయణ

by Thanuru Gopichand |

రాష్ట్రంలోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో విపత్తుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని రాష్ట్ర మంత్రి నారాయణ తెలిపారు.

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు : మంత్రి నారాయణ
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో విపత్తుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని రాష్ట్ర మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ముంపు నివారణ చర్యలను చేపట్టామన్నారు. నెల్లూరు కార్పొరేషనులో సిల్ట్ తొలగించడం వల్ల ఎక్కడా వర్షం నీరు నిలవడం లేదన్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా పంట కాలువలను ఆక్రమించి నిర్మాణాలు జరిగాయన్నారు. వాటి వల్ల నీటి ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే కాలువలపై వెలసిన ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు.

Next Story