Udayagiri: నేనూ బస్టాండ్ సెంటర్‌కు వస్తా.. నువ్వురా చంద్రశేఖర్‌రెడ్డి..?

by Disha Web Desk 16 |
Udayagiri: నేనూ బస్టాండ్ సెంటర్‌కు వస్తా.. నువ్వురా చంద్రశేఖర్‌రెడ్డి..?
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి సవాల్‌ను వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి స్వీకరించారు. శుక్రవారం ఉదయం తాను కూడా ఉదయగిరి బస్టాండ్ సెంటర్‌కు వెళ్తానన్నారు. ఉదయగిరి అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని చెప్పారు. దమ్ముంటే మేకపాటి రావాలని సవాల్ విసిరారు. మేకపాటికి ఎలాంటి సమాధానం చెప్పాలో అది చెబుతానని హెచ్చరించారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తన ఓటుకు అమ్ముకున్నారని ఆరోపించారు. 2సార్లు వైసీపీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి సీఎం జగన్‌ను విమర్శించడం సరికాదన్నారు. తాను టికెట్ ఆశించడంలేదని... సీఎం జగన్ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్లు పోటీ చేస్తారని చేజర్ల సుబ్బారెడ్డి తెలిపారు.

ఉదయగిరి బస్టాండ్ సెంటర్‌లో కుర్చి వేసుకుని కూర్చుకున్న మేకపాటి

కాగా నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి సవాల్‌ను స్వీకరించారు. ఉదయగిరి వస్తే ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని తరుముకుంటూ కొడతామని హెచ్చరించిన నేపథ్యంలో బస్టాండ్ సెంటర్‌లో గంటన్నరసేపు వెయిట్ చేశారు. ఎవడొస్తాడో రండిరా అంటూ ఛాలెంజ్ చేశారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సస్పెన్షన్ తర్వాత ఉదయగిరి నియోజకవర్గంలో అడుగుపెట్ట నివ్వమని వైసీపీ నేతలు హెచ్చరించారు. ఉదయగిరికి వస్తే తరుముకుంటామన్నారు. దీంతో వారి సవాల్‌ను స్వీకరించిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బస్టాండ్ సెంటర్‌లో కూర్చీ వేసుకుని వెయిట్ చేశారు. గంటన్నర సేపు వేయిట్ చేశాను. దమ్ముంటే తనపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటే రండి. మీలాంటి లుచ్చా వాళ్లని ప్రజలు నమ్మరు అని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు.

ఇటీవల కాలంలో లేనిపోని అబండాలు వేసి పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి ఎనలేని సేవ చేసినట్లు వెల్లడించారు. వైఎస్ఆర్ హయాంలో ఎమ్మెల్యే అయ్యానని... వైఎస్ఆర్ మరణం అనంతరం నాలుగున్నరేళ్లు అధికారంలో ఉన్నా జగన్ కోసం పదవికి రాజీనామా చేసి సొంత సొమ్ముతో గెలుపొందినట్లు తెలిపారు. ప్రజలతో ఉన్న మమేకంతోనే నాలుగుసార్లు గెలుపొందినట్లు వెల్లడించారు. ఇప్పుడు తనపై సవాళ్లు విసిరిన వాళ్లు ఒకప్పుడు తన కాళ్లు పట్టుకున్న వాళ్లేనని చెప్పుకొచ్చారు. ఎంపీపీ పదవులు కావాలని కాళ్లావేళ్లా పట్టుకున్నారు. అలాంటి వాళ్లు నేడు దుర్భాషలాడి నానా మాటలు మాట్లాడుతున్నారని, మగాళ్లు అనిపించుకోవాలంటే తనపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు.



Next Story

Most Viewed