నిందితురాలు అరుణకు రిమాండ్.. జైలుకు తరలింపు

by Vemula.Srinu Prasad |

ఫ్లాట్ యాజమానిని బెదిరించిన కేసులో నిందితురాలని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు...

నిందితురాలు అరుణకు రిమాండ్.. జైలుకు తరలింపు
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు(Nellore)కు చెందిన రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్(Rowdysheeter Srikanth parole) వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఆ పెరోల్ వెనుక శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ఉన్నారనే ప్రచారం సైతం జరిగింది. దీంతో ఆమె పేరు కూడా రాష్ట్రవ్యాప్తంగా మరోమోగిపోయింది. అంతేకాదు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రౌడీ షీటర్ శ్రీకాంత్‌తో కలిసి అరుణ కూడా దందాలు నిర్వహించారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెల్లూరు జిల్లా కోవూరులో ఓ ప్లాట్ యాజమానిని కూడా బెదిరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

దీంతో అరుణతో పాటు మరో ముగ్గురిపైనా కేసు కూడా నమోదు అయింది. ఈ కేసులో ఆమెను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. కేసు విచారించిన ధర్మాసనం అరుణకు 14 రోజల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను ఒంగోలు జైలుకు తరలించారు. ఇక ఇదే కేసులో మరో ముగ్గుర్ని కావలి సబ్ జైలుకు తరలించారు.

Next Story