- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nellore: రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఆత్మకూరు బస్టాండు రైల్వే అండర్ బ్రిడ్జి ట్రాక్‌పై రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు....

X
దిశ, నెల్లూరు: ఆత్మకూరు బస్టాండు రైల్వే అండర్ బ్రిడ్జి ట్రాక్‌పై రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. కొన్ని రోజుల క్రితం అదే స్థలంలో జరిగిన రైలు ప్రమాదంలో రైలు ఢీకొని ముగ్గురు మరణించారు. ఈ సంఘటన నుంచి తీరుకోకముందే అదే తరహాలో మరో వ్యక్తి మరణించాడు. ఈ స్థలంలో ఒకే తరహా ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని, ఇప్పటికైనా అధికారులు ఈ ప్రదేశంలోని నడక మార్గానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపి మారో ప్రాణం పోకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ప్రాణాలు పోవడానికి రైలు ట్రాక్‌పై అవగాహన లేకుండా నడవడం ప్రధాన కారణమని తెలుస్తోంది. చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- nellore
Next Story






