Abdul Aziz: పార్టీలకతీతంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

by Vemula.Srinu Prasad |

ఆంధ్ర రాష్ట్రంతో పాటు దేశ విదేశాల్లో ఎక్కడైతే తెలుగు వారున్నారో పార్టీలకతీతంగా శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నారని నెల్లూరు జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షడు అబ్థుల్ అజీజ్ పేర్కొన్నారు....

Abdul Aziz: పార్టీలకతీతంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
X

దిశ, నెల్లూరు: ఆంధ్ర రాష్ట్రంతో పాటు దేశ విదేశాల్లో ఎక్కడైతే తెలుగు వారున్నారో పార్టీలకతీతంగా శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నారని నెల్లూరు జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షడు అబ్థుల్ అజీజ్ పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం పదిలంగా ఉందంటే అందుకు కారణం దివంగత నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ నెల 21న నగరంలోని మినీ బైపాస్‌లో గల మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించనున్నారు. కార్యక్రమాన్ని అబ్దుల్ అజీజ్, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి, చర్ల వెంకటేశ్వర్ రెడ్డి, జెడ్ శివప్రసాద్, తాళ్ళపాక అనురాధ లు పరిశీలించారు.

ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ..నగరంలోని మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణమండపంలో సాయంత్రం ఐదు గంటలకు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించనున్నామని, కేవలం తెలుగువారి ఆత్మగౌరవం ఇప్పటివరకు పదిలంగా ఉందంటే దానిని ముందుకు తీసుకెళ్తున్నామంటే దానికి కారణం తారక రామారావు అని అజీజ్ కొనియాడారు.

Next Story