- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nellore : సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద బందోబస్తు
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రేపు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ప్రముఖ ఆలయాల వద్ద రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో పోలీసులు ముందస్తు చర్యలను చేపట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు (Nellore) జిల్లాలోని సంగంలో ఉన్న సంగమేశ్వర స్వామి దేవాలయానికి కూడా కార్తీ పౌర్ణమి (Karthika Pournami) పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. స్వామి వారిని దర్శించుకొని కార్తీక దీపాలను వెలిగిస్తారు. పూజలు, అర్చనలు, అభిషేకాలను నిర్వహిస్తారు. దర్శించుకునే వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. దీంతో ఆలయ నిర్వాహకులు భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
దేవాలయాన్ని సందర్శించిన సీఐ.. ఎస్ఐ
సంగం సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని (Sangameshwara Swamy Temple) సీఐ వేమా రెడ్డి, ఎస్ఐ రాజేశ్ సందర్శించారు. ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ ఈఓ రఘురామయ్యతో మాట్లాడి భక్తుల భద్రత కోసం చేసిన ఏర్పాట్ల గురించి మాట్లాడారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భక్తులు కూడా శ్రద్ధాసక్తులతో, ప్రశాంత మనసుతో సంయమనం పాటిస్తూ దేవతామూర్తుల దర్శనం చేసుకోవాలన్నారు. హడావుడికి తావులేకుండా బందోబస్తులో ఉండే పోలీసు సిబ్బందికి సహకరించాలని కోరారు. చేజర్ల మండలంలోని కోటి తీర్థంలో (Koti Teertham) కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.






