అనుమానించారు.. అందుకే వదులుకున్నా: Sridhar Reddy

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-03-06 17:02:31  IST  )

అనుమానం ఉన్నచోట ఉండకూడదని 15 నెలల రాజ్యాధికారాన్ని వదులుకొని వైసీపీ నుంచి బయటకు వచ్చానని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు...

అనుమానించారు.. అందుకే వదులుకున్నా: Sridhar Reddy
X

దిశ, నెల్లూరు: అనుమానం ఉన్నచోట ఉండకూడదని 15 నెలల రాజ్యాధికారాన్ని వదులుకొని వైసీపీ నుంచి బయటకు వచ్చానని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ 34వ డివిజన్ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తామన్నారు. వంద కేసులు పెట్టినా, సంవత్సరం పాటు జైల్లో వేసినా లెక్క చేసే ప్రసక్తేలేదన్నారు. గత 9 సంవత్సరాలుగా అధికారం ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ఎమ్మెల్యే అంటే శ్రీధర్ రెడ్డిలాగా ఉండాలనే విధంగా చేసి చూపించామని తెలిపారు. సీఎం జగన్ కూడా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నుంచి చూసే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశారన్నారని కోటంరెడ్డి చెప్పారు.

Next Story