Nellore Rural | నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి సహకరిస్తున్నారు

by Thanuru Gopichand |

నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకరిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (KotamReddy Sridhar Reddy) అన్నారు.

Nellore Rural | నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి సహకరిస్తున్నారు
X

దిశ, వెబ్ డెస్క్ : నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకరిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (KotamReddy Sridhar Reddy) అన్నారు. నియోజకవర్గ పరిధిలోని మద్రాస్ బస్టాండ్ పండ్ల మార్కెట్ వద్ద మౌలిక సదుపాయల పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం నెల్లూరు అగ్రికల్చర్ మార్కెట్లో (Agriculture Market) రూ.50లక్షల నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని అన్నారు. వాటిని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. మార్కెట్ కమిటీ (Market Committee) సభ్యులంతా ఒకే కుటుంబంలా కలిసికట్టుగా ఉండాలని సూచించారు. భవిష్యత్తులో మార్కెట్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యాపారస్తులు చేసిన సూచనలను కూడా పరిగణలోకి తీసుకొని స్థానిక ఎమ్మెల్యేగా మార్కెట్ అభివృద్ధికి (Developement) కృషి చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, వైస్ చైర్మన్ రాపూరు చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ సభ్యులు, పండ్ల మార్కెట్ అసోసియేషన్ సభ్యులు తదితరులున్నారు.

Next Story