- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Janasena: వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేసి ప్రజలపై మోయలేని భారాల మోపుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం నేర్పటం ఖాయమని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి పేర్కొన్నారు.....

దిశ, నెల్లూరు: ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేసి ప్రజలపై మోయలేని భారాల మోపుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం నేర్పటం ఖాయమని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘జనం కోసం జనసేన’ కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం నెల్లూరు ఏడవ డివిజన్ న్యూ విద్యా భారతి స్కూల్ ప్రాంతం నుంచి గడపగడపకు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో మోసపూరితమైన హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటిని నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేక లక్షలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన సాగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేనను ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.






