- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nellore | గ్యాస్ సిలిండర్ పేలి పూరిళ్లు దగ్ధం
గ్యాస్ సిలిండర్ పేలి పూరిళ్లు దగ్ధమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

దిశ, వెబ్ డెస్క్ : గ్యాస్ సిలిండర్ పేలి పూరిళ్లు దగ్ధమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం నాయుడుపేటలోని (Naidupeta) లోతువానిగుంటలో యానాది సుబ్బమ్మ అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఆమె పూరిళ్లు (Hut)నుంచి పెద్ద శబ్దం వచ్చింది. చూస్తుండగానే ఇంటికి నిప్పు అంటుకుంది. కొద్దిసేపటికే పూరిళ్లు దగ్ధమైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాద (Fire Accident) ఘటనా స్థలానికి వెంటనే చేరుకొని మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకుని ఇంటి వద్ద చేరుకున్న సుబ్బమ్మ, ఆమె కుటుంబం ఆవేదనకు గురైంది. ఇటీవలే ఇంటి నిర్మాణానికి అనుమతి సాంక్షన్ అయ్యిందని.. బేస్మెంట్ తదితర పనుల కోసం రెండున్నర లక్షల వరకు నగదు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నామని బాధిత కుటుంబం తెలిపింది. అగ్ని ప్రమాదం జరగడంతో ఆ డబ్బులు మంటల్లో కాలిపోయాయని చెబుతోంది. అంతేకాకుండా కొంత బంగారం, వెండి కూడా నష్టపోయినట్లు పేర్కొంటున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని సుబ్బమ్మ కుటుంబం కోరుతోంది.






