- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > ఏపీ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Nelloreలో స్కూళ్లకు సెలవులు.. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు
Nelloreలో స్కూళ్లకు సెలవులు.. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు
నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ కలెక్టర్ చక్రధర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. మాండూస్ తుఫాను నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్, విద్యుత్ శాఖ ఉద్యోగులను అప్రమత్తం చేశారు. ..

X
దిశ వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ కలెక్టర్ చక్రధర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. మాండూస్ తుఫాను నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్, విద్యుత్ శాఖ ఉద్యోగులను అప్రమత్తం చేశారు. విధులకు హాజరుకావాలని, సమన్వయంతో పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సైతం సిద్ధం చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను గుర్తించారు. అక్కడి ప్రజలను పునరావాసాలకు తరలిస్తున్నారు. అటు పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. తుఫాను పరిస్థితులు తగ్గేవరకూ స్కూళ్లు మూసివేయనున్నారు. తాము ప్రకటనే చేసే వరకూ విద్యార్థులు బయటకు రావొద్దని కలెక్టర్ పిలుపు నిచ్చారు.
Next Story






