Nellore : నవోదయ విద్యాలయంలో బాలిక ఆత్మహత్య

by Thanuru Gopichand |   (  Updated:2025-11-19 05:17:08  IST  )

నవోదయ విద్యాలయంలో (Navodaya Vidyalaya) బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది.

Nellore : నవోదయ విద్యాలయంలో బాలిక ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్ : నవోదయ విద్యాలయంలో (Navodaya Vidyalaya) బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం మర్రిపాడు మండలం కృష్ణాపురం (Krishnapuram)నవోదయ విద్యాలయంలో చదువుతున్న14ఏళ్ల ప్రణీత అనే బాలిక బలవన్మరణానికి (Student death) పాల్పడింది. ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అర్ధరాత్రి 2 నుంచి 2:30 గంటలకు బలవన్మరణానికి పాల్పడ్డ బాలికను చూసి ఆయమ్మ ప్రిన్సిపాల్ కు సమాచారం తెలియజేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. బాలిక ప్రణీతది కావలి రూరల్ లోని అటవీరాజు పాలెం. తండ్రి కొండాపురం ఎంఈఓగా విధులు నిర్వహిస్తూ నవోదయ విద్యాలయంలో బాలికను చదివిస్తున్నారు. కూతురు బలవన్మరణం విషయం తెలుసుకుని నవోదయ విద్యాలయానికి చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న కూతురిని చూసి బోరున విలపించారు.

Next Story