- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > ఏపీ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Nellore | నందవరం కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
Nellore | నందవరం కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
by Thanuru Gopichand |
నెల్లూరు (Nellore) జిల్లా మర్రిపాడు మండలం పరిధిలోని నందవరం (Nandavaram) కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

X
దిశ, వెబ్ డెస్క్ : నెల్లూరు (Nellore) జిల్లా మర్రిపాడు మండలం పరిధిలోని నందవరం (Nandavaram) కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో నెల్లూరు–ముంబై జాతీయ రహదారి పై ఈ ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీలను తీసుకెళ్తున్న ఆటోను సిమెంట్ ట్యాంకర్ లారీ వెనుక నుండి ఢీకొట్టడంతో ఆటో పూర్తి దెబ్బతింది. ఆటోలో ప్రయాణిస్తున్న పది మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. కాగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలపాలు అయ్యారు. గాయపడిన వారిని 108 సహాయంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు, సిఐ గంగాధర్ , ఎస్సై శ్రీనివాసరావు పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






