నెల్లూరు జిల్లా | పూజారి ఇంట్లో బంగారం చోరీ..

by Thanuru Gopichand |

కష్టపడి సంపాదించుకున్న బంగారం చోరీ (Gold Theft) అవ్వడంతో వృద్ధ దంపతులు ఆవేదనకు లోనైన ఘటన నెల్లూరు జిల్లాలోని (Nellore) ఇందుకూరుపేట మండలంలో ఉన్న మైపాడు గ్రామంలో చోటు చేసుకుంది.

నెల్లూరు జిల్లా | పూజారి ఇంట్లో బంగారం చోరీ..
X

దిశ, వెబ్ డెస్క్ : కష్టపడి సంపాదించుకున్న బంగారం చోరీ (Gold Theft) అవ్వడంతో వృద్ధ దంపతులు ఆవేదనకు లోనైన ఘటన నెల్లూరు జిల్లాలోని (Nellore) ఇందుకూరుపేట మండలంలో ఉన్న మైపాడు గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకూరుపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్మూర్తి దంపతులు ఇందుకూరుపేట మండలంలోని మైపాడు గ్రామంలో నివాసం ఉంటున్నారు. స్థానికంగా కృష్ణ మందిరం ఉంది. అందులో రామ్మూర్తి పూజారిగా విధులను నిర్వహిస్తున్నారు. గుడి ద్వారా లభించే మొత్తంతో పాటు భక్తులు ద్వారా వచ్చే వస్తువులతో జీవనం సాగిస్తున్నారు. వయసు పైబడిన భార్యతో ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారి వద్ద కూడబెట్టుకున్న డబ్బుతో కొనుకున్న కొంత బంగారం ఉంది. ఈ క్రమంలో శనివారం రాత్రి వారు నిద్రపోతున్నారు. నిద్రలో ఉన్న క్రమంలో ఓ గుర్తు తెలియని దుండగుడు వారి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంటి ఆవరణలోని మంచంలో దాచిపెట్టిన బంగారాన్ని చోరీ చేసి పరారయ్యాడు. అయితే చీకటి వేళ కావడంతో ఎవరో దొంగలు వచ్చి ఉంటారని భావించిన వృద్ధ దంపతులు భయానికి వెంటనే స్పందించలేదు. ఉదయం వేళ మంచం వద్దకు వెళ్లి గమనించగా మంచంపై ఉన్న దిండులో దాచి ఉంచిన బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ హఠత్పరిణామంతో వారు నిశ్చేష్టులయ్యారు.

వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వృద్ధులైన రామ్మూర్తి దంపతులు ఇచ్చిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వారి ఇంటి వద్దకు పరుపరుగున వచ్చారు. దంపతులను అడిగి సంఘటన గురించి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఇల్లు అంతటా తనిఖీలు చేశారు. ఇంట్లో ఎక్కడైనా పడిపోయి ఉంటుందా అని. బంగారం లభ్యం కాకపోవడంతో చోరీ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. బంగారం జాగ్రత్త దాచుకొని ఉండాల్సిందని వృద్ధ దంపతులకు సూచించారు. అనంతరం వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయంపై రామ్మూర్తి దంపతులు స్పందిస్తూ.. తామెంతో కష్టపడి పోగు చేసుకున్న బంగారం అని చెప్పారు. చీకటి వేళ దుండగుడు తమకు సరిగ్గా కానరాలేదన్నారు. సుమారు 5 సవర్ల బంగారం చోరీకి గురయ్యిందన్నారు. తమ కష్టార్జితం దొంగపాలు కావడంతో కన్నీరుమున్నీరు అయ్యారు. ఎలాగైనా తమ బంగారాన్ని వెతికిపెట్టాలని.. తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు రామ్మూర్తి దంపతుల ఇంటికి చేరుకొని వారిని ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పి సముదాయించారు.

Next Story