- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nellore : రైల్వే బ్రిడ్జిల నిర్మాణం అత్యవసరం
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో రైల్వే బ్రిడ్జిల (Railway Bridges) తక్షణ నిర్మాణం ఎంతో అవసరమని నియోజకవర్గవాసులు అంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో రైల్వే బ్రిడ్జిల (Railway Bridges) తక్షణ నిర్మాణం ఎంతో అవసరమని నియోజకవర్గవాసులు అంటున్నారు. రైల్వే బ్రిడ్జిల నిర్మాణం ద్వారా రైల్వే లెవల్ క్రాసింగ్ ప్రమాదాలు తప్పుతాయంటున్నారు. తద్వారా ప్రజల భద్రతకు ప్రాధాన్యం లభిస్తుందన్నారు. ఇప్పటికే నెల్లూరు టౌన్ (Nellore Town) లోని కొండాయపాలెం, భక్తవత్సలనగర్ ప్రాంతాల్లో రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ప్రస్తుతం భూసేకరణ దశలో ఉన్నాయి. ఈ రైల్వే అండర్ బ్రిడ్జిలు నిర్మాణం అత్యవసరం అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotam Reddy Sridhar Reddy) అంటున్నారు. ఈ మేరకు లా అండ్ జస్టిస్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి, నెల్లూరు జిల్లా ఇంచార్జి మంత్రి యన్.యం.డి ఫరూక్ (Minister MD Farooq) కు లేఖను రాశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రైల్వే అండర్ బ్రిడ్జిలు నిర్మాణం అత్యంత అవసరం ఉన్నదని.. ఈ మార్గాల్లో నిరంతరం రోడ్డురవాణా, ప్రజా రాకపోకలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైల్వే లెవెల్ క్రాసింగ్ ప్రమాదాలు నివారణతోపాటు ప్రజల భద్రత (Public Safety) దృష్ట్యా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. అదే విధంగా జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించి నిర్మాణ పనులను తక్షణమే వేగవంతంగా పూర్తి చేయవలసిన అవసరం ఉందన్నారు.
చింతారెడ్డిపాలెం జంక్షన్ (Chintha Reddy Palem) మెడికవర్ హాస్పిటల్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. పై తెలిపిన మూడు నిర్మాణ పనుల విషయమై మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemi Reddy Prabhakar Reddy) ప్రత్యేక చొరవ తిసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు. జిల్లా ఇంచార్జి మంత్రి అయిన యన్.యం.డి ఫరూక్ ప్రత్యేక చొరవ తీసుకొని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. తద్వారా నెల్లూరు ప్రజల చిరకాల కోరిక నెరవేరే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.






