కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి మాకు సంబంధం లేదు: MLA Ramireddy Pratap

by Vemula.Srinu Prasad |

కావలిలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఘటన దురదృష్టకరమని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ అన్నారు..

కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై  దాడి మాకు సంబంధం లేదు: MLA Ramireddy Pratap
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా కావలి మండలం మద్దూరుపాడు జాతీయ రోడ్డుపై హారన్ కొట్టారని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ బీఆర్ సింగ్‌పై వైసీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయి దాడి చేశారు. అయితే ఈ దాడి చేసింది వైసీపీ నాయకులని సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ స్పందించారు. కావలిలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఘటన దురదృష్టకరమన్నారు. అయితు ఎవరో దాడికి పాల్పడితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్నట్లు నారా లోకేశ్ చిత్రీకరించడం తగదన్నారు. ఇలాంటి దాడులను తమ పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదని చెప్పారు. ఘటనకు బాధ్యులైన వారిపై పోలీసులు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ డిమాండ్ చేశారు.

Next Story