MlA Mock Assembly: నాలుగు గంటలకు పైగా నిల్చున్నా సమయం ఇవ్వలేదు...

by Vemula.Srinu Prasad |

నెల్లూరు రూరల్ సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం అవకాశం ఇవ్వలేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు...

MlA Mock Assembly: నాలుగు గంటలకు పైగా నిల్చున్నా సమయం ఇవ్వలేదు...
X

దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు రూరల్ సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం అవకాశం ఇవ్వలేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కార్యాలయంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసమే అసెంబ్లీలో నాలుగు గంటల 10 నిమిషాల సేపు నిలబడినట్లు చెప్పారు. రూరల్ సమస్యలు ప్రస్తావించేందుకు తనకు స్పీకర్ ఐదు నిమిషాల సమయం కూడా కేటాయించలేకపోయారని వాపోయారు. అదే తనను తిట్టేందుకు నలుగురు మంత్రులకు 40 నిమిషాల సమయాన్ని ఇచ్చారని ఆరోపించారు. మాక్ అసెంబ్లీలో పొట్టే పాలెం, నెల్లూరు రూరల్‌ సమస్యలను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేవనెత్తారు. స్పీకర్‌గా షంషూద్దీన్ వ్యవహరించారు.

Next Story