- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > ఏపీ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Mla Kotam Reddy: ప్రభుత్వం స్పందించకపోతే దీక్ష చేపడతా
Mla Kotam Reddy: ప్రభుత్వం స్పందించకపోతే దీక్ష చేపడతా
by Vemula.Srinu Prasad |
నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యలను తాను అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ప్రజల పక్షాన తన గళం వినిపిస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు....

X
దిశ, నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యలను తాను అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ప్రజల పక్షాన తన గళం వినిపిస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. తాను అధికార పక్షానికి దూరంగా ఉన్నా సమస్యల పరిష్కారం కోసం తన శక్తి వంచన లేకుండా పోరాడుతూనే ఉంటానని ఆయన చెప్పారు. పొట్టేపాళెం- ములుముడికలుజు వంతెనకు ఈనెల 30 లోపు ప్రభుత్వం పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏప్రిల్ 6న జలదీక్ష చేపడతానని చెప్పారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న కాలనీలలో కనీస వసతులు లేవని మండిపడ్డారు. కొమ్మరపూడి రైతుల భూముల పరిహారం కోసం చాలా ఏళ్లుగా అన్నిరకాల ప్రయత్నాలు చేశానని, అయినా సమస్యలు పరిష్కారం కాలేదని శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.
Next Story






