Mla Anil Kumar: గృహసారథులకు కీలక సూచనలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-02-18 16:29:36  IST  )

గృహసారథులు ప్రతి ఇంటికి వెళ్ళి గత ప్రభుత్వం ఏం చేసింది, జగన్ ప్రభుత్వం ఏం చేస్తోందో ప్రజలకు తెలియజేయాలంటూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆదేశించారు...

Mla Anil Kumar: గృహసారథులకు కీలక సూచనలు
X

దిశ, నెల్లూరు: గృహసారథులు ప్రతి ఇంటికి వెళ్ళి గత ప్రభుత్వం ఏం చేసింది, జగన్ ప్రభుత్వం ఏం చేస్తోందో ప్రజలకు తెలియజేయాలంటూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సూచించారు. స్టోన్‌హాస్ పేట ఎస్.బి.ఎస్. కళ్యాణ మండపంలో నిర్వహించిన 'మా నమ్మకం నువ్వే జగన్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అనిల్ మాట్లాడుతూ కన్వీనర్లతోపాటు వలంటీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ వారికి పూర్తి భరోసా కల్పించాలన్నారు. శెట్టిగుంటరోడ్డులో రోడ్డు పనులు పూర్తి చేశామని, సర్వేపల్లి కాలువ పనులు త్వరలో పూర్తి అవుతాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, ప్రతి సంక్షేమం, అభివృద్ధి పనుల గురించి ప్రజలకు పూర్తిగా వివరిస్తూ ముందుకెళ్ళాలని అనిల్ కుమార్ సూచించారు.

Next Story