- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > ఏపీ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Nellore: తోడేరు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ
Nellore: తోడేరు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ
నెల్లూరు జిల్లా తోడేరు గ్రామంలో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన ఆరు కుటుంబాలను మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పరామర్శించారు...

X
దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లా తోడేరు గ్రామంలో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన ఆరు కుటుంబాలను మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం ఒక్కొక్క కుటుంబానికి రు.5 లక్షలను అందజేశారు. బాధిత కుటుంబాలను మంత్రి కాకాణి ఓదార్చారు. తోడేరు పడవ ప్రమాదం ఘటన తనను ఎంతో కలచివేసిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వెళ్ళగానే ఆయన ఎంతో ఉదారంగా స్పందించి ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారని చెప్పారు. చేతికి అందిన బిడ్డలను కోల్పోవడం బాధాకరమని, ఆ బిడ్డలను తీసుకో రాలేకపోయినా ఆ కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చారు.
Next Story






