Minister Kakani: పబ్లిసిటీ స్టంట్ కోసమే కోటంరెడ్డి దీక్ష

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-04-06 12:33:10  IST  )

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జలదీక్షపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సెటైర్లు వేశారు....

Minister Kakani: పబ్లిసిటీ స్టంట్ కోసమే కోటంరెడ్డి దీక్ష
X

దిశ,డైనమిక్ బ్యూరో: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జలదీక్షపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సెటైర్లు వేశారు. నెల్లూరు మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి గౌరవం, హోదా కల్పించిందని గుర్తు చేశారు. అయితే అధికారంలో ఉన్న నాలుగేళ్ల పాటు ఆయన పొట్టేపాలెం కలుజు వంటి సమస్యలపై మాట్లాడకుండా బయటికి వెళ్లిన తర్వాత దానిపై దీక్షకు కూర్చుంటామని చెప్పటం పబ్లిసిటీ స్టంట్ తప్ప ఇంకొకటి కాదని వ్యాఖ్యానించారు. పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉందని కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదని విమర్శించారు. బయటకు వెళ్లి పార్టీపై బురద జల్లటం సబబు కాదని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి హెచ్చరించారు.

Next Story